పికాసో చిత్రమైన
అచిత్ర కారుడు,
అతడు గీసింది కన్నా
చెరిపింది ఎక్కువ:
మన కళ్ళ మీది కటకటాల్ని
కుంచెతో చెరిపేశాడు.
అప్పట్నించీ మన కళ్ళు
ఎగరటం నేర్చుకున్నాయి.
11.10.1983
అచిత్ర కారుడు,
అతడు గీసింది కన్నా
చెరిపింది ఎక్కువ:
మన కళ్ళ మీది కటకటాల్ని
కుంచెతో చెరిపేశాడు.
అప్పట్నించీ మన కళ్ళు
ఎగరటం నేర్చుకున్నాయి.
11.10.1983
మన లోపలి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసే ఒక్క పదబంధమో, వాక్యమో చాలు.. మనని, చాలా కాలం వెంటాడటానికి. మనలో అనూహ్యమైన మార్పులు తీసుకురావడానికి. అలాంటి ఊహలు కవికి ఎలా వస్తాయి? జీవితం పట్ల ఎంత శ్రద్ధా, అవగాహనా ఉంటే, జీవితాన్ని దర్శించడంలో ఎంత తాజా చూపు ఉంటే, అలాంటి భావాలు స్ఫురిస్తాయి.
ReplyDeleteనా వరకూ, 'అతడు గీసింది కన్నా చెరిపింది ఎక్కువ' అనే ఒక్క వాక్యం ప్రతిసారీ కొత్త మెలకువని ప్రసాదిస్తూనే ఉంటుంది. అనేక ఉద్వేగాలనీ, ఆలోచనలనీ, నమ్మకాలనీ చెరుపుకొంటూ మరింత లోతైన సత్యంలోకీ, సౌందర్యంలోకీ ప్రయాణిస్తున్నపుడల్లా ఈ ఒక్క మాటా మరింత రెలవెంట్ అవుతున్నట్లుంటుంది. 'కటకటాలన్నీ చెరిగిపోయి, కళ్ళు ఎగరటం నేర్చుకొన్న ' ట్లుంటుంది.
జగన్నాధరాజు గారూ, ఇస్మాయిల్ మిత్రమండలి తరఫున ఈ అమూల్య నిధిని అందిస్తున్న మీకు నా ధన్యవాదాలు.