ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Thursday, November 1, 2012

ధనియాల తిప్ప (ముమ్మిడివరం తాలూకా)


అంతా ఒక తెల్ల కాగితం.

అందులో ఒక మూలగా
ఒక అడ్డుగీతా
ఒక నిలువు గీతా -
తెరచాప ఎత్తిన పడవ.

కిందిది నదీ
పైది ఆకాశమూ
కావొచ్చు.

3.10.1983

1 comment:

  1. ఇస్మాయిల్ గారి చాలా కవితలు నాకు పాఠాల్లాంటివి. నా కవిత్వంలో కనిపించే ప్రశాంతస్వరాన్ని, స్పష్టతనీ, స్వచ్చమైన సంవేదనాశీలతనీ చాలా వరకూ, ఆయన కవిత్వం నుండే నేర్చుకొన్నాను. ముఖ్యం గా కొన్ని కవితలూ, కొన్ని వ్యక్తీకరణలూ నాకు ఎప్పటికీ అద్భుతం గానే అనిపిస్తాయి.

    అలాంటి కవితల్లో ఈ 'ధనియాల తిప్ప ' ఒకటి. ఒక కవితలోంచి, వృధా అయినవన్నీ శుభ్రంగా తుడిచేసి, స్వచ్చమైన సౌందర్యాన్ని మాత్రమే మిగల్చాలంటే, కవి జీవితానుభవంలో సంపూర్ణతా, పారదర్శకతా ఉండాలి, కవితాభివ్యక్తి పై కవికి పూర్తి అధికారం ఉండాలి. ఈ కవిత చదివినప్పుడల్లా, నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇలా ఊహించటం కవికి ఎలా సాధ్యమైందా అని. సగటు కవి ఈ దృశ్యాన్ని కవిత్వం చెయ్యాలంటే ఎంత ప్రయాసపడి ఉండేవాడు అనిపిస్తుంది.

    సుమారు ముప్పై ఏళ్ళ క్రితం రాసిన ఈ కవిత, ఇవాళ రాసినంత తాజాగా ఉంటుంది. అలాగే, ఈ ధనియాల తిప్ప మనలో చాలా మంది జీవితాలలో ఎదురయ్యే ఉంటుంది.

    ReplyDelete