చల్లటి బల్బు కాంతిలో
తెల్లటి దుప్పట్లు పరిచిన
ఇస్త్రీ బల్లతో
మా వీధి చివర లాండ్రి
మాటి మాటికి నన్ను
ఆహ్వానిస్తోంది.
పాల తరకల దుప్పటితో
పలకరించే ఇస్త్రీ బల్లపై
పరిగెత్తుకుపోయి
పవ్వళించా లనుంటుంది.
అప్పుడు లాండ్రీ అతను
చప్పున నను సరిదిద్ది
నడతలో నా వంకర్లనీ
ముడతలు పడ్డ ఆలోచనల్నీ
ఇస్త్రీ పెట్టెతో రుద్ది
శాస్త్రీయంగా సాపు చేసి
నీటుగా నన్ను మడతపెట్టి
దీటుగా హేంగరుకు తగిలించి
మోసుకుపోయి నన్ను
మా ఆవిడ కప్పగించి
'ఇదిగో నమ్మా తీసుకో
ఇస్త్రీ చేసిన నీ భర్త' అంటే
ఎంత సంతోషిస్తుందో ఆమె,
ఇంతింతని చెప్పలేం.
తెల్లటి దుప్పట్లు పరిచిన
ఇస్త్రీ బల్లతో
మా వీధి చివర లాండ్రి
మాటి మాటికి నన్ను
ఆహ్వానిస్తోంది.
పాల తరకల దుప్పటితో
పలకరించే ఇస్త్రీ బల్లపై
పరిగెత్తుకుపోయి
పవ్వళించా లనుంటుంది.
అప్పుడు లాండ్రీ అతను
చప్పున నను సరిదిద్ది
నడతలో నా వంకర్లనీ
ముడతలు పడ్డ ఆలోచనల్నీ
ఇస్త్రీ పెట్టెతో రుద్ది
శాస్త్రీయంగా సాపు చేసి
నీటుగా నన్ను మడతపెట్టి
దీటుగా హేంగరుకు తగిలించి
మోసుకుపోయి నన్ను
మా ఆవిడ కప్పగించి
'ఇదిగో నమ్మా తీసుకో
ఇస్త్రీ చేసిన నీ భర్త' అంటే
ఎంత సంతోషిస్తుందో ఆమె,
ఇంతింతని చెప్పలేం.
ఇలాంటి ఐడియాలు పోస్ట్ చేయడాన్ని నిషేధించాలి
ReplyDelete- అ.భా.అ.భ.ఐ.కా.స (అఖిల భారత అమాయక భర్తల ఐక్య కార్యాచరణ సమితి )