ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Monday, December 5, 2011

3 of 20

విడవలేక, విడవలేక
విడవలేక వాన బొట్టు
చూరును విడిచింది.
------
కాజీపేట నించి కాకినాడ దాకా
ఒకటే వాన; దారిపొడుగునా
భూమ్మీద ఆరేసిన పాత ఆకాశాలు.
------
పచ్చిక మొలిచి
బాటని కప్పేసింది;
మళ్ళి ఎన్ని వందల కాళ్ళవసరమో !
------
ఒకమ్మాయి మెడ తిప్పి
ఎవర్నో చూసే నవ్వుతుంది.
ఆ 'ఎవరో' నేనైతే ఎంత బావుణ్ణు.
------
నువ్వెళ్ళి తొంగి చూస్తే
వానాకాలం బావి
జూమ్లెన్స్ తో ఫోటో తీస్తుంది.
------
ఎవరి కోసం వర్షిస్తాయి మేఘాలు,
పిల్లల కోసం కాకపోతే.
గొడుగులడ్డు పెట్టుకునే వాళ్ళ కోసమా ?
------

1 comment:

  1. "నువ్వెళ్ళి తొంగి చూస్తే
    వానాకాలం బావి
    జూమ్లెన్స్ తో ఫోటో తీస్తుంది"

    "పచ్చిక మొలిచి
    బాటని కప్పేసింది;
    మళ్ళి ఎన్ని వందల కాళ్ళవసరమో !"


    ఎంత అద్భుతంగా చెప్పారు!!!!దటీజ్ ఇస్మాయిల్ గారు. ఇవన్నీ సేకరించి శ్రమకోర్చి మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete