ఇస్మాయిల్ రచనల సంగ్రహం

ఇస్మాయిల్ గారి హైకూలు, కవితలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు...

Tuesday, November 29, 2011

దీపస్తంభం

మిత్రులు వాడ్రేవు చినవీరభద్రుడు ఇస్మాయిల్ గారి గురించి ఓ చక్కటి వ్యాసం పంపించారు.
ఇక్కడ క్లిక్ చేసి చదువు కోవచ్చు, డౌన్ లోడ్ చేసుకోనూవచ్చు..

"దీపస్తంభం"

Sunday, November 27, 2011

ఇస్మాయిల్ కవితా పురస్కారం, 2010 పొందిన కవితా సంకలనం "రెండో పాత్ర" . కవి : విన్నకోట రవి శంకర్

ఇస్మాయిల్ కవితా పురస్కారం
శ్రీ విన్నకోట రవి శంకర్ రచించిన ‘రెండో పాత్ర’ కవితా సంపుటికి ఇస్మాయిల్ కవితా పురస్కారం ప్రదానం చేసారు. ఆదివారం ఉదయం స్థానికి పి.ఆర్. కాలేజి ఆడిటోరియం లో ఘనంగా నిర్వహించిన సభలో పలువురు వక్తలు పాల్గొని ఇస్మాయిల్ గారి గురించి ‘మళ్లీ మాట్లాడుకుందాం’ అంటూ నిర్వహించిన సభ కవిత్వ పరిమళంతో గుభాళించింది.
‘రెండో పాత్ర’ కవితా విశిష్టతను వివరిస్తూ శ్రీ రెంటాల ఉపన్యసించారు. కవిత్వంలో నిశ్శబ్దం పోషించే పాత్ర, పదాల పొందిక, పొదుపుగా వాడుకొనే పనితనం కవి రవిశంకర్ సొంతమని సోదాహరణంగా వివరించారు. రెండో పాత్ర సంపుటి లోంచి ఆయన చదివి వినిపించి అలరింప చేసారు.
‘ఇస్మాయిల్ కి ఇష్టమైన కవి టాగోర్’ అన్న అంశం మీద ప్రముఖ కవి అవధాని శ్రీ డా. రాళ్లబండి కవితా ప్రసాద్ ఉపన్యాసం చాలా ఆహ్లాదంగా సాగింది. చలం అనువాదాల ద్వారా ఇస్మాయిల్ భావాలతో సమన్వయం పరచిన తీరు శ్రోతల్ని ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడి రచన ‘నేను తిరిగిన దారులు’ పుస్తకాన్ని డా. ఆలూరి విజయ లక్ష్మి గారు ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర పుస్తక పరిచయం చేస్తూ యాత్రా సాహిత్యంలో ఇదొక ప్రత్యేక రచనగా అభివర్నిచారు.
అనంతరం పురస్కార గ్రహీతకి అవార్డు ప్రధానం, సత్కారం జరిగాయి. ఇస్మాయిల్ గారి శిష్యుడైన తనకు ఆయన పేరుతో అవార్డు రావడం పట్టరాని సంతోషంగా ఉందన్నారు కవి రవిశంకర్.
విదేశాల్లో ఉద్యోగరీత్యా ఎంతో ‘బిజీ’ గా ఉన్నప్పటికీ కవిత్వ పురస్కారం సందర్భంగా ఇస్మాయిల్ గారి మీద ప్రేమతో, ఇస్మాయిల్ మిత్ర మండలి ఆహ్వానాన్ని మన్నించి వ్యయ ప్రయాసల కోర్చి ఈ సభకి వచ్చిన కవి రవిశంకర్ ని అంతా అభినందించారు. ఆద్యంతం సభని శ్రీ సి.యస్. ఆహ్లాదంగా నిర్వహించారు.
కార్యక్రమాన్ని శ్రీమతి ధూళిపాళ అన్నపూర్ణ గారు ప్రారంభించారు. ప్రారంభంలో కవి భగవంతం ఆలపించిన కీర్తన శ్రోతల్ని అలరించింది.
ప్రతియేట నిజమైన మంచి కవిత్వానికి గుర్తింపుగా ఇవ్వబడుతోన్న ఈ పురస్కార ప్రధాన కార్యక్రమం ఇలా ఆహ్లాదంగా ప్రతియేట కొనసాగిస్తామని మిత్రమండలి తరుపున శ్రీమతి డా. వాడ్రేవు వీర లక్ష్మీ దేవి తెలియజేస్తూ ‘ఆంధ్రా పేపర్ మిల్స్’ వారు మిత్ర మండలికి రూ. 15000/- విరాళం అందించారని తెలియజేసారు.
వాడ్రేవు చిన వీరభద్రుడు, కుప్పిలి పద్మ, తల్లావఝుల పతంజలి శాస్త్రి, మధునాపంతుల చలపతి, దాట్ల దేవదానం రాజు, కొప్పర్తి, ఎం.ఎస్. సూర్యనారాయణ, అద్దేపల్లి ప్రభు, ఎం.ఎస్. నాయిడు, గోటేటి లలిత శేఖర్, రామ చంద్రా రెడ్డి, జగన్, రవి, నామడి శ్రీధర్, డా. ఎల్.కే.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

please click here to see all photos of the event :